Newsminute24

జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎల్పీ భట్టి విక్రమార్క..

Mancherial :మంచిర్యాల జిల్లాలో సీఎల్పీ భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ యాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న ల‌భిస్తోంది. ఈనేప‌థ్యంలోనే బ‌డుగు , బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచి.. వారి హ‌క్కుల కోసం పోరాడి..సాధికార‌త క‌ల్ప‌న‌కు కృషి చేసిన మ‌హాత్మా జ్యోతిబా పూలే జ‌యంతి సంద‌ర్భంగా ఆమ‌హానీయుడి చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు భ‌ట్టివిక్ర‌మార్క‌. ఈకార్య‌క్ర‌మంలో ఆయ‌న‌తో పాటు ఏఐసీసీ కార్య‌ద‌ర్శి రోహిత్ చౌద‌రి, జిల్లా అధ్య‌క్షురాలు కొక్కిరాల సురేఖ‌, పీసీసీ, ఓయూ జేఏసీ నాయ‌కులు పాల్గొన్నారు.

Exit mobile version