Site icon Newsminute24

కరోనా మార్గదర్శకాలను కొనసాగించాలి : కేంద్రం

దేశంలో మలి దఫా కరోన విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా మార్గదర్శకాలను మార్చి 31 వరకు పొడిగించినట్టు తెలిపారు. కరోనా నియంత్రణ కోసం ప్రజలంతా మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం, వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రం ఆదేశాలను రాష్ట్రాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. కరోనా కేసులు గత ఐదు నెలలుగా క్షీణించినట్టు కనబడినా కొన్ని వారాలుగా మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని  పేర్కొన్నారు. రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకొని కొవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు. రాష్ట్రాల విషయానికొస్తే, మహారాష్ట్రలో శుక్రవారం ఒక్కరోజే 25000 కొత్త కేసులు రాగా.. దిల్లీలో 700లకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయని పేర్కొంది.

Exit mobile version