Teluguliterature: ప్రముఖ పాత్రికేయులు, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ ఆర్. దిలీప్ రెడ్డి నేడు దేవులపల్లి రామానుజరావు పురస్కారాన్ని అందుకున్నారు. వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులు సమక్షంలో రవీంద్ర భారతిలో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. కె. వి. రమణచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అనంతరం దీలిప్ రెడ్డిని ఆయన శాలువాతో సత్కరించి అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లురి శివారెడ్డి సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మాట్లాడుతూ.. జర్నలిస్ట్ గా,సమాచార హక్కు చట్టం కమిషనర్ గా, పర్యావరణ వేత్తగా విశేష సేవలందించిన దిలీప్ రెడ్డి భవిష్యత్ తరాలకు ఆదర్శమని కొనియాడారు.
కాగా నాటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా విశేష సేవనందించిన దేవులపల్లి రామానుజరావు పేరుతో తెలంగాణ పరిషత్తు ఏటా పురస్కారం అందజేస్తున్నది. ఈ ఏటా.. మీడియాలో వివిధ హోదాల్లో విశేష సేవలదించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, సమాజ శ్రేయస్సుకోసం నిత్యం పరితపించే పర్యావరణ ప్రేమికుడు దిలీప్ రెడ్డిని ఈఅవార్డుకి ఎంపికజేసింది. నేడు రామానుజరావు జయంతి కావడంతో రవీంద్ర భారతిలో ఆయన పేరిట అవార్డును ప్రధానం చేసింది.