Site icon Newsminute24

సోషల్ మీడియాతో మోసపోవద్దు: నటి ప్రియ

Kollywood: సోషల్ మీడియా మాయ ప్రపంచం లాంటిది.. ముసుగు చాటు మనిషిలా అందులో కనిపించే ఫోటోలు చూసి దాన్నే అందం అనుకొని మోసపోవద్దని నటి ప్రియా భవాని శంకర్ యువతకు సూచించారు. తెరపై కనిపించే స్టార్లు అందానికి కాపాడుకోవడానికి చాలా ఖర్చు చేస్తుంటారని.. డబ్బులుంటే కాకిని కూడా తెల్లగా మార్చేయొచ్చని.. కానీ ఆ డబ్బును గెలవడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. శరీర సౌష్టవం, రంగు , రూపం వంటి విషయాల్లో ఎవరైనా మిమ్మల్ని నోప్పిస్తే పట్టించుకోవద్దన్నారు. 

ఇక అందం కాపాడుకోవడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందని..ఓ మామూలు స్టూడెంట్ అలా చేయలేడు కాబట్టి ఆత్మన్యూనత  చెందాల్సిన అవసరం లేదని ప్రియ తెలిసి చెప్పింది. నిజానికి అసలైన అందం అంటే ఇది కాదని.. దానికి అసలు నిర్వచనం ఇంకా కనుక్కోలేదని తెలిపింది. తాను తెరపై అందంగా కనపడడానికి పది మంది ఆర్టిస్టుల కష్టం ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం కోలీవుడ్ లో  వరుస సినిమాలు చేస్తున్న ప్రియా బిజీ షెడ్యూల్ గడుపుతోంది.ఇటీవల ఆమె నటించిన రుద్రుడు తమిళ్ , తెలుగు భాషల్లో విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది.

Exit mobile version