Site icon Newsminute24

టీఆర్ఎస్ కు మరో షాక్ ..బూర దారిలో కర్నె ప్రభాకర్.. నెక్స్ట్ ఎవరూ?

మునుగోడు ఉప ఎన్నిక వేళ అధికార టీఆర్ఎస్ కు షాకులు మీద షాకులు తగులుతున్నాయి.ఇప్పటికే  మాజీ ఎంపి బూర నరసయ్య పార్టీకి రాజీనామా చేయగా..  అదే దారిలో మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ పార్టీని వీడెందుకు సిద్ధ పడినట్లు తెలుస్తుంది. వీరితో పాటు మరికొందరు నేతలు లైన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో రంగంలోకి దిగిన మంత్రి జగదీష్ రెడ్డి నష్ట నివారణకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

కాగా ఉప ఎన్నిక సీటు ఆశించి భంగపడ్డ నేతల్లో కర్నె ప్రభాకర్ ఒకరు. తొలుత అందరూ అతన్నే పార్టీ అభ్యర్ధిగా ప్రకటిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే అదిష్టానం మాత్రం కూసుకుంట్ల వైపు మొగ్గు చూపడంతో మిన్నుకుండి పోయారు. అంతేకాక పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటానని హామీ కూడా ఇచ్చాడు.ఇప్పుడు ఉన్నట్టుండి కర్నె  పార్టీని వీడతారన్న ప్రచారం టీఆర్ఎస్ నేతల్లో గుబులు పుట్టిస్తోంది.

నిన్న బూర నర్సయ్య..నేడు కర్నె ప్రభాకర్.. రేపు ఎవరు పార్టీని వీడుతారన్న చర్చ టీఆర్ఎస్ నేతల్లో  నడుస్తోంది. ఉప ఎన్నిక ప్రచారం నువ్వు నేనా  అన్నట్టు జరుగుతున్న సమయంలో.. బీజేపీ అదును చూసి దెబ్బకొట్టడంతో కారు పార్టీ నేతలు గిల గిల కొట్టుకుంటున్నారు.మరికొంతమంది నేతలు పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతుంది. టిఆర్ఎస్ మంత్రులు.. ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలంతా మునుగోడులో తిష్ట వేసిన.. నేతలు పార్టీని వీడటం గులాబీ నేతల్ని అయోమయానికి గురి చేస్తుంది.

Exit mobile version