Site icon Newsminute24

Ycp ప్రభుత్వ ఆర్డినెన్సు హర్షం: గిడుగు రుద్రరాజు

ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టాన్ని పొడిగిస్తూ ycp ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకే ప్రభుత్వం ఈ ఆర్డినెన్సు ఇచ్చిందన్న ఆయన.. ఇది దళిత గిరిజన శక్తుల పోరాట విజయమని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో..”ఎస్సీ ఎస్టీ స్పెషల్ డవలప్మెంట్ ఫండ్” పేరుతో కట్టుదిట్టమైన చట్టం తీసుకురావడం తోపాటు.. ఎస్సీ ఎస్టీ లకి కేటాయించే నిధులను దారి మల్లించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఆర్డినెన్సు తెచ్చిన విధంగానే ప్రభుత్వం నిలిపివేసిన 27 సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని గిడుగు పేర్కొన్నారు.

Exit mobile version