Site icon Newsminute24

ఒక్క అవకాశం ఇవ్వండి… ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి… ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్నారు యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.“తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటున్న కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారని… తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండని అభ్యర్థించారు.  వరంగల్  ప్రాంతానికి చెందిన వంగర బిడ్డ పీవీ నరసింహరావు దేశానికి ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. పాదయాత్రలో ఎవరిని కలిసినా సంతోషంగా లేరన్నారు. నా మీద కోపంతో కొడంగల్ ను అభివృద్ధి చేయలేదనుకున్నా.. కానీ కొండా దంపతుల మీద కోపంతో వరంగల్ ను కూడా అభివృద్ధి చేయలేదని వాపోయారు. గొప్ప చరిత్ర ఉన్న ఈ వరంగల్ కు 2014 నుంచి గ్రహణం పట్టిందని.. ప్రపంచానికి మేధావులను అందించిన చరిత్ర కాకతీయ యూనివర్సిటీదని.. అలాంటి  యూనివర్సిటీలో నియామకాలు లేవు, ప్రొఫెసర్లు లేని పరిస్థితి దాపురించిందని రేవంత్ మండిపడ్డారు. 

Exit mobile version