Newsminute24

Telangana: హరిత విప్లవమే మనందరికీ రక్ష: ప్రొ.పురుషోత్తమ్ రెడ్డి

Agriculture: స్థానిక విత్తనం కేంద్రంగా.. రైతే లక్ష్యంగా వ్యవసాయంలో వచ్చే సమూల మార్పులతోనే నిజమైన హరిత విప్లవం సాధ్యమని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొ. పురుషోత్తమ్ రెడ్డి తెలిపారు. హరిత విప్లవమే మనందరికీ రక్షని..విత్తనాన్ని సంకరం చేసి-వ్యవసాయాన్ని రసాయనమయం చేసిన ప్రక్రియ‘హరిత విప్లవం’ కాదని ఆయన అన్నారు. శుక్రవారం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్(సీజీఆర్) భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తొలి వార్షిక ‘విత్తనాల పండుగ’ను కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో పురుషోత్తం రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీజీఆర్ ఈ మూడు రోజుల పండుగలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. విత్తనం రైతు హక్కుని.. రాష్ట్రంలో రైతులకు అసలైన పండుగ మొదలయిందన్నారు.గతంలో నకిలీ విత్తనాల వలన రైతుకు తీవ్రంగా నష్టపోయారని పురుషోత్తం రెడ్డి గుర్తు చేశారు.

ఇక మూడు రోజుల విత్తనాల పండగలో భాగంగా కర్ణాటక,రాజస్థాన్, తమిళనాడు,కేరళ తదితర రాష్ట్రాల విత్తనాల నిపుణులు, ఆర్గానిక్ సంస్థలతో 52 స్టాల్స్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. విత్తనాలు బ్యాంక్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. అనంతరం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్.అన్వేష్ రెడ్డి సుంకెటి మాట్లాడుతూ..సంప్రదాయ విత్తనాలు గ్రామ స్థాయిలో అవగాహనతో విస్తృత పరచాలన్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రలల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ  కార్యక్రమంలో ఐఏఎస్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్ల్యూ రాంపుల్లా రెడ్డి, ఎమినెంట్ సీడ్ కన్జర్వేటర్ (పద్మశ్రీ )రైమతి ఘురియా ఒడిశా,భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ జాకబ్ నెల్లితాన్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్.డా.డి.రాజి రెడ్డి, పబ్లిక్ పాలసీ నిపుణులు డా.దొంతి నరసింహా రెడ్డి,CGR అధ్యక్షులు కె. లీలా లక్ష్మా రెడ్డి,CGR వ్యవస్థాపకులు కె. లక్ష్మా రెడ్డి , CGR Advisor ఆర్. దిలీప్ రెడ్డి,రైతులు,విద్యార్థులు, ప్రొఫెసర్లు, మేధావులు, సైంటిస్టులు,డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version