Site icon Newsminute24

వాట్ ఎన్ ఐడియా.. కోడి గుడ్డు పెంకు ఇంత ఈజీగా తీసేయొచ్చా..వైర‌ల్ వీడియో..

Sambasiva Rao:

________________

మ‌నం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే రోజు కోడి గుడ్డు తినాల‌ని వైద్యులు చూసిస్తారు. అయితే అంద‌రికి కోడి గుడ్డు ఉడికించిన త‌ర్వాత పొట్టు తీయాలంటే ఎంతో క‌ష్టంతో కూడుకున్న ప‌ని. కోడి గుడ్డు పెంకు తీయ‌డం కోసం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తారు. దీంతో సమయం కూడా వృధా అయిపోతుంది. కోడి గుడ్డుప‌పైనున్న పొట్టును  స్పీడ్‌గా తీస్తే త్వరగా తినేసి మిగ‌తా ప‌నులు చేసుకోవ‌చ్చు.

అంద‌రి క‌ష్టాల‌కు చెక్ చెబుతూ ఒక వ్య‌క్తి  కోడిగుడ్డు పెంకును ఎంతో ఈజీగా తీసేశాడు. అందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొక్క తీసేయొచ్చు అని ఆ వీడియోలో చూపించాడు. 

కోడిగుడ్లు పొట్టు తీయడానికి గుడ్డు కింద భాగంలో పెద్ద రంధ్రం చేశాడు. ఇక మ‌రోవైపు చిన్న రంధ్రం చేస్తాడు. ఆ తర్వాత మీ లంగ్స్  సామర్థ్యాన్ని ఉప‌యోగించి.. చిన్న రంధ్రం దగ్గర బ‌లంగా గాలి ఊదాడు. దాంతో కోడిగుడ్డు బ‌య‌ట‌కు వ‌చ్చింది.  ఇలా సింపుల్ ఎలా తీయోచ్చో చెప్పాడు. ఒక వీడియో చూసిన నెటిజ‌న్లు అత‌న్ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు.

 

Exit mobile version