Site icon Newsminute24

Hyderabad: టెలికమ్యూనికేషన్, ఐటి రంగాల్లో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది: పటేల్ రమేష్ రెడ్డి

హైదరాబాద్: బేగంపేట్ వైట్ హౌస్‌లో నూతనంగా నిర్మించిన న్యూ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ ని సోమవారం  తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “టెలికమ్యూనికేషన్, ఐటి, కార్పొరేట్ రంగాల్లో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి ప్రాంగణాలు యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. హైదరాబాద్‌ను ప్రపంచ కార్పొరేట్ మ్యాప్‌పై మరింత బలంగా నిలిపే దిశగా ఇవి మైలురాళ్లవిగా నిలుస్తాయి,” అని తెలిపారు.

ఈ కార్యాలయ ప్రారంభంతో ఎన్నో కార్పొరేట్ కార్యకలాపాలు ఒక్కచోటే సమర్థవంతంగా నిర్వహించబడతాయని, ఇది నగర అభివృద్ధికి దోహదపడుతుందని కూడా ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ గారు మరియు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మరియు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ ప్రతినిధులు పాల్గొన్నారు

Exit mobile version