Newsminute24

జగన్ ప్రభుత్వం పై జనసేన కార్టూన్ల దాడి..

Janasena : జగన్ ప్రభుత్వం పై జనసేన కార్టూన్ల దాడి పరంపర కొనసాగుతుంది. తాజాగా జనసేన రూపొందించిన కార్టూన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అటు జనసైనికులు, ఇటు టిడిపి అభిమానులు కార్టూన్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఏపీ వ్యాప్తంగా జనసేన కార్టూన్ పై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ఇక జనసేన పార్టీ రూపొందించడం కార్టూన్ పరిశీలించినట్లయితే.. జగన్ సూట్ కేసులు మోస్తున్నట్లు.. పాపం పసివాడి టైటిల్.. నోట్లో వేలు పెడితే కొరకలేడు క్యాప్షన్ తో కార్టూన్ రూపొందించారు. అంతకుముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇదే టైటిల్ తో చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.  ఈ కథకు రాజస్థాన్ ఎడారులు కావాలి. కానీ వైసీపీ మన ఏపీలో నది తీరాల నుంచి ఇసుక దోచేసింది. కలెక్షన్ పాయింట్లలో తగినన్ని ఇసుక దిబ్బలు ఉన్నాయి ..చీర్స్.. సారాంశంతో పవన్ ట్వీట్ చేశారు.

Exit mobile version