Newsminute24

Telangana: జర్నలిస్ట్ వుప్పల నరసింహం మృతి..!

VuppalaNarasimha: సాహిత్య ప్రేమికులు జీర్ణించుకోలేని వార్త.  ప్రముఖరచయిత,సీనియర్ జర్నలిస్ట్ వుప్పల నరసింహం గురువారం  అనారోగ్యంతో మృతి చెందారు. ఆంధ్రప్రభ దినపత్రికలో సంపాదకులుగా పనిచేశారు. అంతేకాక సాహిత్య రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన మృతితో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు,శ్రేయోభిషలు శోక సంద్రంలో మునిగిపోయారు.

వుప్పల నరసింహం సబండవర్ణాల వారసత్వం,వాదం, మట్టి మనిషి ఉప్పల నరసింహం కథలు,నిజం, మావోయిస్టుల రక్త చరిత్ర, అద్దంలో బౌద్ధం, హళ్ళికి హళ్ళి,రాగం, భావం, క్లేశవుడు,ఊసరవెల్లి,జంగల్ నామాపై జనం ప్రజా ప్రశ్న,ఈ ఆధునిక అద్వైతంపై ఓ చెవి పెడతారా అనేక పుస్తకాలను ముద్రించారు. వివిధ అవార్డులను అందుకున్నారు. పార్థివదేహాన్ని  రేపు మధ్యాహ్నం హైదరాబాదులోని గోల్నాకలో  అంతక్రియ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని బంధువులు తెలిపారు.

Exit mobile version