విజయవాడ, నవంబర్ 5:
కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతోనే రైతుకు న్యాయం జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.బుధవారం విజయవాడ సివిల్ సప్లై భవన్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఈసారి ఖరీఫ్ మాసానికి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు సిద్ధం అయ్యామని మంత్రి నాదెండ్ల తెలిపారు. అంటే రూ.12,200 కోట్లు విలువైన ధాన్యం కొనుగోలుకు సిద్ధం అయినట్లు చెప్పారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు 4041 రైతు సేవా కేంద్రాలు,3803 ధాన్యం కొనుగోలు కేంద్రాలు,16700 మంది సిబ్బందితో ధాన్యం కొనుగోలు సిద్ధమవుతున్నట్టు తెలిపారు.
గత ఏడాది అనుభవాల దృశ్య 6 కోట్ల గోతాలను సిద్ధం చేసినట్లు తెలిపారు.
గత ప్రభుత్వం దాదాపు రూ.1670 కోట్ల బకాయిలు వదిలి వెళ్ళిందని, కొన్ని సందర్భాలలో రైతులకు చెల్లించాల్సిన ఆంబకాయలను 6 నెలలు నుంచి 9 నెలల వరకు ఇవ్వలేదని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 87 శాతం ధాన్యం కొనుగోలు డబ్బులు 48 గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేసామని తెలిపారు. ఈ సారి 24 గంటల్లోనే రైతు ఖాతాలో నగదు జమ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. తేమ శాతం రీడింగ్ విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా ఒకే రకమైన కంపెనీ మిషన్లు వాడాలని నిర్ణయించినట్టు తెలిపారు. అవసరమైన చోట బ్లూ టూత్ ద్వారా లెక్కించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తన చేతిలోని ఫోన్ ద్వారా వాట్సాప్ లో ” HI” అని మెసేజ్ చేసి ధాన్యం కొనుగోలుకు రైతు షెడ్యూల్ చేసుకున్న అవకాశం కల్పించామన్నారు.
ఇక నుంచి ప్రతినెల, ప్రతి వారం ధాన్యం కొనుగోలు పై సమీక్షిస్తామన్నారు..
ధాన్యం కొనుగోలు క్యాలెండర్
నవంబర్ – 11 లక్షల మెట్రిక్ టన్నులు
డిసెంబర్ – 25 లక్షలు
జనవరి – 8 లక్షలు
ఫిబ్రవరి – 3 లక్షలు
మార్చి – 4 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధమయ్యేలా క్యాలండర్స్ తయారు చేశామన్నారు.
జనవరి నుండి రైస్ కార్డు దారులకు ఒక్కో కుటుంబానికి 1 కిలో గోధుమపిండి 18 రూపాయలకు పంపిణీ చేస్తామని మంత్రి ప్రకటించారు. ఇందుకోసం 2400 మెట్రిక్ టన్నుల గోధుమపిండి సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
దీపం -2 పథకం 3వ విడత లో ఇప్పటివరకు 90 లక్షల మంది లబ్ధి పొందారున్నారు. నవంబర్ 30 వరకు 3 వ విడత కొనసాగుతుందన్నారు.
మొంథా తుఫాను బాధితులకు పౌరసరఫరాల శాఖ 2 లక్షల 39 వేల 169 మంది కుటుంబాలకు నిత్యావసరాలు అందించిందన్నారు. ఇప్పటికే స్మార్ట్ కార్డ్‌లు 92 శాతం పంపిణీ పూర్తి అయిందని అన్నారు. నెలాఖరున మిగిలిన కార్డులు వెనక్కి తీసుకుని… మనమిత్ర యాప్ ద్వారా కోరిన వారికి పరిశీలించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నవంబర్ మాసంలో వర్ష సూచనలు కారణంగా రైతులకు ఇబ్బంది లేకుండా 50 వేలు టారపాలిన్‌లు ఉచితంగా అందిస్తామని మంత్రి అన్నారు.చాలా జిల్లాల్లో ఈ క్రాప్ పూర్తి అయిందని.. . 39 లక్షల 51 వేల ఎకరాలు ధాన్యం కొనుగోలు ఈ క్రాప్ కింద నమోదు అయినట్లు తెలిపారు. 85 లక్షల మెట్రిక్ టన్నులు క్రాప్ వస్తుందనిభావిస్తున్నామన్నారు. పంట నష్టం నమోదు చేసి అందించినప్పుడు ధాన్యం కొనుగోలు చేయరని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది అబద్ధం ప్రచారం అన్నారు.. నూటికి నూరు శాతం ఈ క్రాప్‌లో నమోదు అయిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సివిల్ సప్లై VC & MD ఢిల్లీ రావు (IAS), డైరెక్టర్ గోవింద్ (IAS) పాల్గొన్నారు.
