Site icon Newsminute24

రైతులకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ వెంటనే అమలు చేయాలి: సంకినేని వెంకటేశ్వర్ రావు

కోదాడ: తెలంగాణ ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు. కోదాడ పట్టణంలో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగోస – బిజెపి భరోసా కార్యక్రమా కార్నర్ మీటింగ్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతి యువకులకు నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని…హత్యలు, అక్రమాలు ,దౌర్జన్యాలతో రాష్ట్రం నలిగిపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి ఒక్కరూ 5 లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య భీమా కొరకు ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని దుయ్యబట్టారు. తెలంగాణని కాపాడుకోవాలంటే బీజేపీ అధికారంలోకి తీసుకురావడమే ఏకైక మార్గమని సంకినేని స్పష్టం చేశారు.

Exit mobile version