ఏపీ ప్రజలు స్వాతంత్ర సమరానికి మించిన పోరాటం చేయల్సిన అవసరముందన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.రాష్ట్రంలో బ్రిటిష్ వారి కంటే దరిద్రమైన పాలన సాగుతోందని దుయ్యబట్టారు.భారత రాజ్యాంగం ప్రజలకు భావ స్వేచ్ఛనిచ్చింది. సభలు సమావేశాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించిందన్నారు. రాష్ట్రంలో అతి దారుణమైన, క్రూరమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. భావ ప్రకటన స్వేచ్ఛను హరించిందని రఘురామ మండిపడ్డారు.
బ్రిటిష్ పోలీస్ చట్టం 1861లోని 30, 30A, 31 లలో పోలీసుల విధివిధానాలు, వాళ్ల పని తీరు గురించి చెబుతున్నాయని రఘురామకృష్ణం గుర్తు చేశారు. సెక్షన్ 30లో ప్రజలు ఒక సమావేశం నిర్వహించాలంటే డి.ఎస్.పి, జిల్లా ఎస్పీ చేత అనుమతి తీసుకోవాలని..వారి విధివిధానాలను పాటించాలని… నిబంధనలను ఉల్లంఘిస్తే 200 రూపాయల జరిమానా కట్టాలన్నారు.ఉయ్యూరు ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ ను మెజిస్ట్రేట్ బెయిల్ పై వదిలేసింది.. లేకపోతే అతన్ని కూడా కస్టడీలో చిత్రహింసలకు గురి చేసేవారేమోనని రఘురామ అనుమానం వ్యక్తం చేశారు.
ఆనం ఉండగానే ఇన్చార్జిని నియమిస్తారా?
సీనియర్ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి పార్టీలో కొనసాగుతుండగానే.. ఇన్చార్జిగా రామ్ కుమార్ రెడ్డి ని నియమించడం హాస్యాస్పదంగా ఉందన్నారు రఘురామ. తమ పార్టీ పెద్దలు డైరెక్ట్ గా ఏది చేయరని.. అన్నీ ఇన్ డైరెక్ట్ గానే చేస్తారని ఎద్దేవా చేశారు. మూడేళ్ల క్రితం తన విషయంలో కూడా సీఎం జగన్ ఇలాగే ప్రవర్తించారన్నారు. ఆరడుగులు ఉన్నవారు ఎవరైనా ముఖ్యమంత్రి కి నచ్చరని?..తాను ఆరడుగులే ఉంటానన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ ను కూడా మా గాడిలో కట్టేసి, అక్కడ కూడా ఇన్చార్జిని చేస్తారా?, లేకపోతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని పిలిపించి మాట్లాడినట్లు మాట్లాడుతారాని? ప్రశ్నించారు. ఇష్టం లేకపోతే పార్టీ నుంచి పంపించాలి కానీ.. వెన్నుపోటు రాజకీయాలు ఎందుకన్నారు. దమ్ముంటే డైరెక్ట్ గా మాట్లాడాలని ఎంపీ రఘురామ సవాల్ విసిరారు.