Janasena: వచ్చే ఎన్నికల్లో జగన్ రాకపోతే పథకాలు ఆగిపోతాయేమో… సంక్షేమం నిలిచిపోతుందేమో అనుకోవద్దు. ఇంతకంటే అద్భుతమైన సంక్షేమ పథకాలు ఉంటాయి తప్ప ఏ పథకమూ ఆగిపోదని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జాతి నాయకుల పేర్లతో సరికొత్త పథకాలను అమలు చేస్తామని ఆయన అన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వీర మహిళల సమావేశంలో పవన్ మాట్లాడారు. ‘‘ విశాఖ పర్యటనలో ఉండగా ఓ 60 ఏళ్ల ఒంటరి మహిళ ఓ కాగితం పట్టుకొని నా దగ్గరకు వచ్చారని.. తాను రెల్లి సామాజిక వర్గానికి చెందిన మహిళనని… ఇంటికి దిక్కుగా ఉన్న కొడుకును అన్యాయంగా హత్య చేశారంటూ కొన్ని చిత్రాలను చూపించారని..దీనిపై పోలీసులు పట్టించుకోవడం లేదని.. మరోపక్క స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా జిల్లా అధికారులు ఎవరూ స్పందించలేదని.. కేసు విచారణ చేయకుండా, నిందితులను పట్టుకోవడం లేదని ఆ తల్లి విలపించినట్లు పవన్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఓ తల్లి వేదన వినలేప్పుడు అధికారం ఎందుకు?.. దండగ
ఓ తల్లి వేదన తీర్చలేని అధికారం ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే అనిపిచిందన్నారు పవన్. వైసీపీ కి 151 సీట్లు, 22 ఎంపీ స్థానాలు ప్రజలు ఇచ్చినా ఓ తల్లి గుండె ఘోష విననపుడు అధికారం ఉండి ఎందుకు దండగ అనిపించిందన్నారు. ఇటీవల తిరుపతి ఎస్పీని కలిసినపుడు మీకు సమాచారం ఎలా వస్తుంది..? మీరు చెప్పే సమాచారం ఎంత వరకు నిజమని అడిగారని.. ఆ ఎస్పీ గారికి చెబుతున్నా… నాకు అధికారం లేకున్నా ప్రజల బాధలు, వారి వేదనలు వినే మనసుందని జనసేనాని పేర్కొన్నారు. బాధిత వర్గాల ప్రజలు నా దగ్గరకు వచ్చి… తమ సమస్యలు చెప్పుకుంతుంటే.. వారి కన్నీటి బాధను వింటానని.. న్యాయం జరుగుతుందనే నమ్మకంతో వారు వస్తున్నారని.. నాకు ప్రజలే సమాచార వారధులని ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చెప్పే సారథులు ప్రజలేనని.. వారి కన్నీటి నుంచి, అంతులేని నరక యాతన నుంచి వచ్చే ప్రతి మాట నాకు పోరాట స్ఫూర్తిని, ప్రశ్నించే గొంతును ఇస్తుందని పవన్ భావోద్వేగంగా మాట్లాడారు.
ఎక్కడికి వెళ్ళినా జగన్ లాంటివాళ్ళు ఉంటారు
కవి శ్రీ కేశవరెడ్డి గారి కథలో రాము రాముడుండాడు…రాజ్యముండాది అన్నట్లుగా దేశంలో ఎక్కడికి వెళ్లినా జగన్ లాంటి మనుషులు కనిపిస్తూనే ఉంటారని పవన్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ వస్తే మేం ఇక్కడి నుంచి పారిపోతాం… ఉండలేం అని నాకు చెప్పుకొని బాధపడేవారే ఎక్కువ కనిపిస్తున్నారని అన్నారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు… ఇలా భిన్న వర్గాల వారు జగన్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని.. బతకడానికి భయపడే పరిస్థితులు వచ్చేస్తాయని మధనపడుతున్నారని వాపోయరు. అందరికీ నేను చెప్పేది ఒక్కటే. ఎక్కడికి వెళ్లినా జగన్ వంటి వ్యక్తులు, అతడి కంటే క్రూరమైన వారు కనిపిస్తూనే ఉంటారు. ఓ నది ఈ నేల విడిచి ఎలా పారిపోలేదో మనం కూడా ఈ నేలను విడిచి పారిపోవాల్సిన అవసరం లేదు. అన్ని వర్గాల వారు జగన్ పాలన చూసి భయపడుతున్నారు. కానీ సమష్టిగా, ఉమ్మడిగా పోరాడి జగన్ లాంటి వారిని తరిమికొట్టాల్సిన అవసరం ఉందని హితువు పలికారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుధం ఉపయోగించి జగన్ వంటి వ్యక్తులను తరిమికొడదామని.. ఈ నేల మనది రాజ్యం మనది.. రాముడు మన వాడు..ఎక్కడికి పారిపోకుండానే జన రాజ్యం తెచ్చుకుందామని పవన్ తేల్చి చెప్పారు.
ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే నేరాల రేటు ఎక్కువగా ఉందన్నారు పవన్. సీఎం నివాసానికి కూత వేటు దూరంలో ఓ అంధురాలిపై వేధింపులకు దిగి హత్య చేస్తే ఈ ముఖ్యమంత్రి, మంత్రుల నుంచి స్పందన కరువైందని మండిపడ్డారు. నన్ను తిట్టడానికి లేచే నోర్లు అప్పుడు మూతపడిపోయాయని.. రేపల్లెలో తన సోదరిని వేధించిన వారిని ప్రశ్నించిన అమర్నాథ్ అనే బాలుడిని పెట్రోలు పోసి తగులబెట్టి హత్య చేస్తే, ఈ వైసీపీ నాయకులు రాజీ చేయడానికి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలపై ధైర్యంగా మాట్లాడే జనసేన అధికార ప్రతినిధి శ్రీమతి కీర్తన మీద వైసీపీ ప్రతినిధులు అనుచితంగా మాట్లాడారని..ఎలా ఉండాలి..? ఏం చేయాలి..? అనేది నిర్ణయించడానికి వైసీపీ నాయకులకు ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. మహిళలకు న్యాయం చేయలేని, వారిని గౌరవించలేదని మనసుతో మీరు ఎన్ని చట్టాలు చేసినా వృథా ప్రయాసేనని.. 30 వేల మంది మహిళలు అదృశ్యం అయిపోయారని నేను చెబితే.. తప్పుడు సమాచారం అని అన్నారని… సాక్షాత్తూ పార్లమెంటులోనే అది నిర్ధారణ అయ్యాక అయినా, కనీసం సమీక్ష పెట్టలేదన్నారు. మహిళలు, చిన్నారులు అక్రమ రవాణా అవుతుంటే కనీసం దానిపైనా సమావేశం పెట్టలేని నిర్లక్ష్యం ముఖ్యమంత్రి వైఖరికి అద్దం పడుతుందని పవన్ వివరించారు.