వికారాబాద్: కేంద్ర బడ్జెట్లో ఆర్వోబీ కి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పచ్చిమ ప్రాంత ప్రజలు.. రాజధానికి వెళ్ళాలన్న.. జిల్లా కేంద్రానికి రావాలన్న ప్రధాన రహదారి పై రైల్వే క్రాసింగ్ ఉండడం వలన ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని వాపోయారు. స్థానిక ప్రజా ప్రతినిధులు.. సంబంధిత అధికారులు.. తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు.త్వరలో కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ గారి అధ్వర్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే జిఏం అరుణ్ కుమార్ జైన్ కలిసి వినతి పత్రం ఇస్తామని రఘువీర్ స్పష్టం చేశారు.
కేంద్ర బడ్జెట్ లో ఆర్వోబీ కి నిధులు కేటాయించాలి : పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీర్
