Newsminute24

జైలుకెళ్లడానికైనా..దెబ్బలు తినడానికైనా సిద్ధం: పవన్ కళ్యాణ్

Janasena: ‘జగన్.. నీ ఇష్టం… సై అంటే సై తేల్చుకుందాం. దేనికైనా నేను రెడీ. వాలంటీర్ అనే జగన్ సమాంతర వ్యవస్థపై నేను సూటిగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా – విచారణకు సిద్ధంగా ఉండాలని ప్రత్యేక జీవో ఇచ్చావ్. ఇదే నీ ప్రభుత్వ పతనానికి మొదటి మెట్టు.. ఈ ప్రభుత్వాన్ని కిందకు లాగేది ఇదేనని గుర్తుంచుకోవాల’ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. నేను ఏదైనా విషయం గురించి మాట్లాడితే ఎలాంటి సమాచారం లేకుండా మాట్లాడను.. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే మాట్లాడతానని పేర్కొన్నారు.  ఎటు వైపు నుంచైనా రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడే ప్రజల ముందు నిజాలు బయటపెడతానని వెల్లడించారు. జైలుకెళ్లడానికైనా… దెబ్బలు తినడానికైనా సిద్ధమని ప్రకటించారు. అరెస్టు చేసుకోండి.. చిత్రహింసలు పెట్టుకోండి – తప్పు జరిగితే కచ్చితంగా ఎత్తి చూపుతామని సవాల్ విసిరారు. కేసులకు, విచారణలకు భయపడేవాడిని కాదని తేల్చిచెప్పారు. ఎవరి గురించి అయినా..ఏ సమాంతర వ్యవస్థ గురించి అయినా నేను చెప్పాలనుకున్నది సూటిగా చెబుతానని స్పష్టం చేశారు. విశాఖపట్నం జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో  పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. 

ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “నేను ప్రజా పోరాటంలో జైలుకు వెళ్లడానికి అయినా, దెబ్బతినడానికి అయినా సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. జగన్ గుర్తు పెట్టుకో… నీకు నీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. నా దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అభ్యున్నతి మీదనే ఉంటుందని హెచ్చరించారు. 21వ శతాబ్ధంలో ప్రజల వ్యక్తిగత సమాచారం అనేది అత్యంత కీలకమని బ్రిటీషు సాంకేతిక నిపుణుడు హంబీ అంటారు. ప్రజల డేటా అనేది క్రూడాయిల్ కంటే విలువైనదని చెబుతారని పవన్ చెప్పుకొచ్చారు.

• హత్యలు చేసినవారిని కాపాడుతున్నారు

వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు అనే సమాంతర వ్యవస్థను నడుపుతూ ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి ఏం చేస్తోంది..? ఎవరికి ఇస్తోంది..? అనేదే తన ప్రాథమిక ప్రశ్నగా పవన్ పేర్కొన్నారు. వాలంటీర్ల పేరుతో సమాంతర వ్యవస్థ నడుపుతున్న వ్యక్తి తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, నన్ను విచారణ చేయడానికి నోటీసులు, జీవోలు పంపితే బెదిరిపోయేవాడిని కాదని.. మరిన్ని ప్రశ్నలు ఎదుర్కోవడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఇక నుంచి ఇంకా బలమైన ప్రశ్నలు మీకు ఎదురుకాబోతున్నాయని.. మీ అక్రమ మైనింగ్ మీద, మీ దోపిడీల మీద, మీ విధానాల మీద నేను ప్రశ్నిస్తూనే ఉంటానని.. తప్పు ఎక్కడ జరిగిందో ఎత్తి చూపుతూనే ఉంటానని స్పష్టం చేశారు. న్యాయం కోసం మాట్లాడితే నోటీసులు వస్తున్నాయని.. హత్యలు చేసిన వారిని ఎలా కాపాడుతున్నారో చూస్తూనే ఉన్నామని పవన్ ఎద్దేవ చేశారు.

 

Exit mobile version