Newsminute24

‘రాజు వెడ్స్ రాంబాయి’ : క్లైమాక్స్ కదిలించినా… కంటెంట్ తేలిపోయింది..!

Moviereview:

By anrwriting[senior film critic]

రేటింగ్: ★★★☆☆ (3/5)

ఈటీవీ విన్ సినిమాలకు ఓ బ్రాండ్ ఏర్పడింది.అలాంటి ఫ్లాట్ ఫామ్ నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఎనలేని ఆసక్తి.తాజాగా వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంపై అలాంటి అటెన్షన్ క్రియేట్ చేసింది. ఈసినిమాకి నెగిటివ్ టాక్ వస్తే నగ్నంగా రోడ్డుపై తిరుగుతా అంటూ విరాట పర్వం సినిమా దర్శకుడు వేణు ఉడుగుల చేసిన వ్యాఖ్యలు సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేసింది. అయితే అంచనాలను ఈ చిత్రం నిలబెట్టిందా? లేదా అన్నది సమీక్షలో తెలుసుకుందాం..!

కథేమిటి?

సినిమా కథ 2010తెలంగాణలోని ఓ పల్లెటూరి నేపథ్యం. పెళ్లిళ్లకు బ్యాండ్ వాయించే రాజు (అఖిల్ రాజ్), అదే ఊరిలో ఉన్న రాంబాయి (తేజస్వీరావు)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. కానీ వీరి ప్రేమ విషయం తెలిసిన రాంబాయి తండ్రి వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ) పెళ్లికి అడ్డుపడతాడు.దీంతో రాజు_ రాంబాయి పారిపోయి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయితారు. ఆతర్వాత ఏమైంది? తెలుసుకోవాలంటే తెరపై సినిమా చూసి తీరాల్సిందే..!

ఎలా ఉందంటే..?

రాజు రాంబాయిల ప్రేమ కథ యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. సినిమా పరంగా హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అంతగాపండలేదు.క్లైమాక్స్ షాకింగ్ గా అనిపిస్తుంది.ఫస్ట్ ఆఫ్ పరంగా చూసుకుంటే యూత్ ఆకట్టుకునే సన్నివేశాల పరంగా ఒకే అని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్ పరంగా పర్లేదు.అమ్మాయి( హీరోయిన్) చెప్పులు వేసుకొని అబ్బాయి(హీరో) భావోద్వేగానికి లోనైన సన్నివేశం సినిమాకి హైలెట్.

ఎవరెలా చేశారంటే..?

నటన పరంగా కొత్తవారైనా హీరో, హీరోయిన్ యాక్టింగ్ సహజంగా అనిపిస్తుంది. పాత్రలకు తగ్గట్టుగా నటించారు. అన్ని ర‌కాల ఎమోష‌న్స్ తో పాటు తెలంగాణ యాస అదరగొట్టారు. కొన్ని సన్నివేశాల్లో తేజ‌స్వీరావు ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్స్ ఆకట్టుకుంటాయి. సీనియర్ నటులు శివాజీరాజా న‌ట‌న నేచుర‌ల్ గా అనిపిస్తుంది.మిగతా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర నటించారు.

సాంకేతికంగా సినిమా లో బడ్జెట్‌ మూవీ అయిన
లుక్ & ఫీల్ పరంగా టెక్నికల్ టీమ్ మంచి స్థాయిలో నిలబెట్టింది. కెమెరా వర్క్, సంగీతం, నాచురల్ లొకేషన్లు బాగున్నాయి. కానీ రైటింగ్, స్క్రీన్‌ప్లే పరంగా తేలిపోయింది.

మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే ‘రాజు వెడ్స్ రాంబాయి’ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్…

Exit mobile version