Newsminute24

Suryapeta: సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో బహుమతుల ప్రధానం..

Suryapeta: బాలెం సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. పి. శైలజ పతాకావిష్కరణ చేసి విద్యార్థులను ఉద్దేశించి  మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధుల సేవలను ప్రిన్సిపల్ కొనియాడారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే దేశభక్తిని అలవర్చుకోవాలన్నారు. అనంతరం  క్రీడా పోటీలలో  విజేతలుగా నిలిచిన విద్యార్థినిలకు  ఎంపీపీ రవీందర్ రెడ్డి,  జెట్పీటిసి బిక్షం  బహుమతులను అందజేశారు. 

విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాల బహుకరణ..

ప్రభుత్వ డిగ్రీ కళాశాల నేలకొండపల్లికి చెందిన చరిత్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్. ఆర్. వెంకట్రాజం సుమారు 5 వేల  రూపాయల విలువైన  పోటీపరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను కళాశాలకు బహుకరించారు.ఈ  కార్యక్రమంలో కళాశాల అధ్యాపక ,అధ్యాపకేతర బృందం , విద్యార్థినిలు పాల్గొన్నారు

 

Exit mobile version