Newsminute24

IT : హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో 2 వేల కోట్లతో తైవాన్ పారిశ్రామిక పార్క్..!

Telangana: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో 2000 కోట్ల భారీ పెట్టుబడి తో తైవానికి చెందిన అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల సమూహం ముందుకొచ్చింది. మొట్టమొదటి ప్రపంచ స్థాయి సాంకేతిక పారిశ్రామిక పార్క్ (ITIP) ను ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు ఐటి పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రతినిధుల బృందం ప్రస్తుతం తైవాన్ రాజధాని తైపిలో పర్యటిస్తోంది. తైవాన్ – భారత ఆర్థిక సంబంధాల పురోగతి క్రమంలో భాగంగా గురువారం నాడు 11 సంవత్సరాలు ఈ పార్కులో పెట్టుబడులు పెట్టడానికి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

ఇక ప్రపంచ స్థాయి సాంకేతిక పారిశ్రామిక పార్క్(ITIP) కి తెలంగాణ ప్రభుత్వం కొంగరకలాన్ లోని ఎలక్ట్రానిక్స్ పార్కులు ఇప్పటికే 15 ఎకరాల భూమిని కేటాయించింది. పూర్తిస్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకు మరో 250 ఎకరాలు భూముని కేటాయించాలని తైవాన్ కంపెనీలు ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. భూ కేటాయింపులు పూర్తయిన వెంటనే పారిశ్రామిక వాడ అభివృద్ధి పనులు మొదలు పెడతామని తైవాన్ ప్రతినిధులు తెలిపారు. దీంతో ఈ భారీ పెట్టుబడులతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు దొరకనున్నాయి.

Exit mobile version