Newsminute24

టీడీపీ ‘సైలెంట్‌ సపోర్టు’, షర్మిల ‘బేషరతు’ మద్దతు– రేవంత్‌ ని ఎక్కడికి పంపిస్తాయో

Nancharaiah merugumala senior journalist:

” 2018 ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు కాంగ్రెస్‌ పార్టీకి శాపంగా మారితే..ఇప్పుడు టీడీపీ ‘సైలెంట్‌ సపోర్టు’, షర్మిల ‘బేషరతు’ మద్దతు– రేవంత్‌ రెడ్డిని ఎక్కడికి పంపిస్తాయో!”

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో ప్రత్యక్ష పొత్తు కాంగ్రెస్‌ పార్టీని ఆదుకోలేదు! నారా చంద్రబాబు నాయుడు ‘పరోక్ష’ మద్దతు, వైఎస్‌ షర్మిల ‘బేషరతు’ సపోర్టు హస్తం పార్టీని 2023లో కాపాడతాయా? అనుమానమే! చిత్తూరు, కడప జిల్లాల్లో మూలాలున్న ఈ రెండు పార్టీల వింత పోకడలూ తెలంగాణ పాలకపక్షానికే అనుకూలంగా మారతాయి. ఎంత కాదన్నా ఆంధ్రా మూలాలున్న ప్రాంతీయపక్షాల ఎన్నికల వేషాలన్నీ చివరికి తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆరెస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును ఈ నవంబర్‌ 30 ఎన్నికల్లో ఖాయంగా గెలిపించేలా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీని రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులకే (కర్ణాటకకే) పరిమితం చేయాలంటే– తెలుగునాట ప్రాంతీయపక్షాలే అధికారంలో కొనసాగాలనే అభిప్రాయం తెలుగోళ్లలో బలంగా ఉంది. తెలంగాణలో బతికి ఉన్నాయో లేదో చెప్పడం సాధ్యం కాని తమ పార్టీల తరఫున అభ్యర్థులను ఈసారి నిలబెట్టకపోతే–ఈ ప్రాంతంలో స్థిరపడిన ఆంధ్రా కమ్మలు, రాయలసీమ రెడ్లు హస్తం గుర్తుకు గుడ్డిగా ఓటేసేటంతటి అమాయకులు కాదని చంద్రబాబు, షర్మిలమ్మ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

Exit mobile version