Newsminute24

అక్కసుతోనే ప్రధాని మోదీని బద్నాం చేసే కుట్ర: బండి సంజయ్

దారిమళ్లించిన పంచాయతీ సొమ్మును BRS ప్రభుత్వం వడ్డీతోసహా చెల్లించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఏపీ క్యాడర్ ను అడ్డంపెట్టుకుని తెలంగాణ సొమ్మును కేసిఆర్ దోచుకుతింటున్నాడని మండిపడ్డారు.కేసీఆర్ కుటుంబ అవినీతిపై విచారణ జరుపుతుంటే.. అక్కసుతోనే ప్రధాని మోడీని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.సీఎం చేతగానితనంవల్లే అప్పలు కుప్పగా రాష్ట్రం మారిందని వాపోయారు.ఆంధ్రోళ్లను రాక్షసులుగా..పెండ బిర్యానీగాళ్లుగా కించపర్చిన కేసీఆర్ ఇప్పుడే ఏం సమాధానం చెబుతారని? సంజయ్ ప్రశ్నించారు.

కాగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ సమగ్రాభివ్రుద్ధి కోరుతూ గత 35 రోజులుగా పాదయాత్ర చేస్తున్న జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయనతో కలిసి నడిచారు బండి సంజయ్. అనంతరం కొల్లాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి సంజయ్ ప్రసంగించారు. స్వామియే శరణం అయ్యప్ప అంటేనే కొంతమందికి వణుకు పుడుతోందన్నారు. ఎల్లేని సుధాకర్ ఏదైనా పట్టుబడితే వదలడని..సాధించేదాకా శ్రమించే నాయకుడని కొనియాడారు. సోమశిలపై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారని గుర్తుచేశారు. జోగులాంబ నుండి దేవరకొండ దాకా జాతీయ రహదారి నిధులు మంజూరుకు కృషి చేసిన నాయకుడు సుధాకర్ రావుని సంజయ్ పేర్కొన్నారు

 

Exit mobile version