Site icon Newsminute24

National:58 మహిళల జీవితాలను నాశనం చేసిన కీచక జ్యోతిష్యుడు…!!

Maharashtra:

సెక్స్.. మత్తు.. బ్లాక్‌మెయిల్‌
58 మహిళల జీవితాలను నాశనం చేసిన కీచక జ్యోతిష్యుడు…
మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కూ లింకులు బయటపడ్డాయా?

మహారాష్ట్రలోని లో సంచలనం రేపిన ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. దేవుడు, జ్యోతిష్యం పేరుతో మహిళలను మోసం చేస్తూ, వారిపై లైంగిక దాడులు చేసి, అనంతరం వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసిన ఓ కీచక జ్యోతిష్యుడు పోలీసుల కస్టడీలోకి వెళ్లాడు. ఈ ఘటనలో సుమారు 58 మంది మహిళలు బాధితులుగా ఉన్నట్లు విచారణలో తేలింది.

పోలీసుల వివరాల ప్రకారం, అనే వ్యక్తి నాసిక్‌లో ప్రముఖ రాజకీయ జ్యోతిష్యుడిగా పేరుపొందాడు. ఆ పేరు, ప్రభావాన్ని ఉపయోగించుకుని, ప్రధానంగా హైక్లాస్ మహిళలను టార్గెట్ చేసేవాడు. జ్యోతిష్యం పేరుతో వారి వ్యక్తిగత సమస్యలను తెలుసుకుని, మాయమాటలతో తన వలలోకి దింపేవాడు.

తన ఫామ్ హౌస్‌ను నేరాలకు కేంద్రంగా మార్చుకున్న ఖరత్, కొందరు మహిళలకు మత్తు పదార్థాలు ఇచ్చి, వారి బలహీన స్థితిని ఉపయోగించుకుని లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దారుణాలన్నింటినీ రహస్య కెమెరాలతో చిత్రీకరించి, తరువాత అదే వీడియోలతో వారిని బెదిరిస్తూ కోట్ల రూపాయలు దోచుకున్నాడని పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులో కీలక మలుపు 35 ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో వచ్చింది. ఆమెను నెలల పాటు బందీగా ఉంచి, శారీరకంగా, మానసికంగా హింసించాడని ఆమె ఆరోపించింది. ఆమె ధైర్యంగా ముందుకు రావడంతోనే ఈ భయానక నిజాలు బయటపడ్డాయి.

అశోక్ ఖరత్ రాజకీయంగా ప్రభావశీలి కావడంతో, ముందస్తు సమాచారం లభిస్తే సాక్షాలను నాశనం చేసే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు రహస్య ఆపరేషన్ చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో ఫామ్ హౌస్‌లోకి చొరబడి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

సోదాల్లో సీసీ కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్కులు, మొబైల్ ఫోన్లు, మరియు దాదాపు రూ.200 కోట్లకు సంబంధించిన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో లభించిన వీడియోలను పరిశీలించిన పోలీసులే షాక్‌కు గురయ్యారు. మహిళలకు డ్రగ్స్ ఇవ్వడం, వారిపై లైంగిక దాడులు చేయడం వంటి దృశ్యాలు రికార్డ్ అయి ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ కేసులో మరో సంచలన అంశం ఏమిటంటే, మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పేరు కూడా వినిపించడం. ఆమె ఈ జ్యోతిష్యుడిని గురువుగా భావించి పాదపూజ చేసిన వీడియోలు బయటకు రావడంతో వివాదం చెలరేగింది. తీవ్ర విమర్శల నడుమ ఆమె తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.

ఈ ఘటన మహిళల భద్రతపై, అలాగే జ్యోతిష్యం పేరుతో జరుగుతున్న మోసాలపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version