Site icon Newsminute24

Bandisanjay: బండి సంజయ్ వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: ప్రవీణ్ రావు

Karimnagar: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపి బండి సంజయ్ కుమార్ పై అసత్య ఆరోపణలు చేస్తున్న నేతలపై బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు  ఓ పొలిటికల్ టూరిస్ట్ లాంటి నాయకుడు..ఆయన ప్రజల సమస్యల కోసం ఏనాడూ కొట్లాడింది లేదు..అలాంటిది నేత ఎంపీ బండి సంజయ్ కుమార్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పిఆర్పి ఎన్నికల సమయంలో హడావిడి చేయడం తప్ప  ఆయన చేసింది ఏమీ లేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఆయన.. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఇదే తరహాలో  హడావిడి చేయడానికి ప్రయత్నం చేశాడని మండిపడ్డారు.  గురువారం కరీంనగర్లో ప్రవీణ్ రావు మాట్లాడుతూ.. ”  అయోధ్య రాముని అంశంలో  కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉందని, రాముని కించపరుస్తూ అనమసర రాజకీయాలు చేస్తుందన్నారు.  హిందువుల ఆరాధ్య దైవం అయోధ్య రాముని జన్మస్థలంపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్న వారికి తగిన రీతిలో సమాధానం చెప్పామని..  కాంగ్రెస్ నేతలు తమకు ఎందుకు ఆపాదించుకొని, పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని  ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాజకీయ అవగాహన లేని కొంతమంది వ్యక్తులు , పనికిమాలిన చిల్లర రాజకీయాలు చేసి.. ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన అభివృద్ధిని ప్రశ్నిస్తున్నారని.. వారికి తగిన రీతిలో సమాధానం చెప్పేందుకు  ప్రజా హిత తో జనం మధ్యలోకి వెళ్ళామన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో  మోడీ ప్రభుత్వం, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన అభివృద్ధి పనులు నియోజకవర్గ ప్రజలకు కనబడుతున్నాయన్నారు ప్రవీణ్ రావు.  ప్రజలకు కనపడుతున్న అభివృధ్ది ..బిఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు కనబడకపోవడం విచిత్రంగా ఉందన్నారు. కాంగ్రెస్ నేత వెలిచల రాజేందర్ రావు  విషయ పరిజ్ఞానం లేకుండా ఎంపీ బండి సంజయ్ కుమార్ గురించి అనవసరంగామాట్లాడుతున్నారన్నారు. ప్రజాసేవ చేయలేని వ్యక్తులు మరోమారు సంజయ్ ని ప్రశ్నిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ప్రవీణ్ రావు హెచ్చరించారు.

 

Exit mobile version