Site icon Newsminute24

APpolitics:ప్రజాసమస్యలు వినే నాథుడే లేడు..!!

APpolitics: ఏపీలో ప్రధాన పార్టీల నేతల పర్యటనలు సామాన్య ప్రజలు ఇబ్బందిగా మారింది. అటు సీఎం జగన్ పర్యటనలు పరదాల  చాటున.. పోలీస్ ఆంక్షలు నడుమ ఉంటున్నాయి. చివరికి పుట్టిపెరిగిన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటన సైతం అనేక  ఆంక్షలు నడుమన సాగుతోంది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుల పర్యటనలు సైతం.. ఎన్ఎస్జీ కమాండోలు.. పోలీసులు.. బౌన్సర్ల పహారాలో జరుగుతోంది. దీంతో సామాన్య ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆపసోపాలు పడుతున్నారు. ఇటు  అధికార పార్టీ నేతలు పట్టించుకోక.. అటు ప్రతిపక్ష పార్టీలు నేతలకు తమ సమస్యలను చెప్పుకునే పరిస్థితి లేక దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టడుతున్నారు.

Exit mobile version