Site icon Newsminute24

Ekadashi:తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా పరిగణించబడే తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.”తొలి ఏకాదశి పండుగ హిందువులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ పవిత్ర దినాన్ని తెలంగాణ ప్రజలు భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మికతతో జరుపుకోవాలని కోరుతున్నట్లు” పేర్కొన్నారు. ప్రజలందరికీ మంచి జరగాలని, ఆరోగ్యం, ఆనందం, శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ మహేష్ కుమార్ గౌడ్ ఈ ప్రత్యేక పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రజలకు తన శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version