Site icon Newsminute24

Nalgonda: గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువతకు టూ టౌన్ సీఐ, ఎస్సై కౌన్సిలింగ్..

నల్లగొండ: పట్టణంలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువతకు పోలీస్ స్టేషన్లో టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ రెడ్డిలు యువకుల తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. పట్టుబడిన 9 మంది యువకుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. గంజాయి అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.జిల్లా ఎస్పీ అపూర్వ రావు ఆదేశాల మేరకు పట్టణంలో గంజాయి విక్రయిదారులపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందన్నారు. పట్టణంలో ఎక్కడైనా యువకులు గంజాయి సేవిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Exit mobile version