Newsminute24

గవర్నర్​ కోటా ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్​ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కిషన్ రెడ్డి

Telangana BJP: గవర్నర్​ కోటా ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్​ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి అభినందనలు తెలుపడంతోపాటు ధన్యవాదాలు చెబుతున్నట్లు వెల్లడించారు. గవర్నర్​ కోటా, రాష్ట్రపతి కోటాలు మేధావులకు..విద్యావంతులకు.. కవులకు.. కళాకారులకు.. సామాజిక కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన నామినేటెడ్​ పదవులని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్​ గతంలో కూడా అనేక క్రిమినల్​ కేసులు ఉన్న వ్యక్తులను ఎమ్మెల్సీలుగా నియమించాలని గవర్నర్​కు ప్రతిపాదనలు పంపితే.. గౌరవ గవర్నర్​ గారు రిజెక్ట్​ చేసిన విషయం తెలిసిందేనని గుర్తు చేశారు.కేసీఆర్​ కుటుంబానికి సేవ చేసే వ్యక్తులను గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

కాగా బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే టిక్కెట్​ ఎవరికి  ఇస్తుందంటే .. వాళ్ల కాళ్లదగ్గరపడి ఉండేవాళ్లకు, వాళ్ల మోచేతి నీళ్లు తాగే వాళ్లకు, ఆత్మగౌరవం లేని వాళ్లకు ఇస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు.  గవర్నర్​ కోటా నామినేటెడ్​ పోస్టులు కూడా అలాంటి వారికే ఇవ్వాలన్నది న్యాయం కాదని.. ఈ విషయంలో గవర్నర్​ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించదగిందని అన్నారు.అనేక పార్టీలు ఫిరాయించిన వారు, కేసీఆర్​ కుటుంబానికి మాత్రమే సేవ చేసే వారిని గవర్నర్​ రిజెక్ట్​ చేశారని తేల్చిచెప్పారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ప్రధాని నరేంద్ర మోడీ .. బీజేపీతో ఏ మాత్రం సంబంధం లేని తెలంగాణ నుంచి ఒక సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్​ ఎంపీగా ప్రతిపాదిస్తే రాష్ట్రపతి ఆమోదం పొందారని గుర్తు చేశారు. దక్షిణాది నుంచి పీటీ ఉష లాంటి అంతర్జాతీయ క్రీడాకారిణిని ప్రతిపాదించగా రాష్ట్రపతి ఓకే చేశారని వివరించారు. తెలంగాణ గవర్నర్​ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదాని.. ఆమెకు తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు  చెప్పుకొచ్చారు. కేసీఆర్​కు అనుకూలంగా ఉంటేనే.. గవర్నర్​గా వ్యవహరించినట్టా? కేసీఆర్​ చేస్తున్న తప్పిదాలు, పొరపాట్లను ఎత్తి చూపుతూ ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే.. గవర్నర్​గా మీక నచ్చరా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

 

Exit mobile version