Site icon Newsminute24

Telangana: టీపీసీసీ చీఫ్ వ్యూహాలు ఫలిస్తున్న వేళ..!!

Hyderabad:

తెలంగాణలో గాంధీ భవన్ ప్రజాసమస్యల పరిష్కారానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టాక గాంధీ భవన్ నిత్యం నేతల రాకపోకలతో, కార్యకర్తల హడావుడి ప్రజల రాకతో సందడిగా మారింది. ఆయన వ్యూహాత్మక ఆలోచనలు పార్టీని క్రమంగా ప్రజలకు చేరువ చేయడంతో పాటు పార్టీ బలోపేతం దిశగా నడిపిస్తున్నాయి.

*ముఖాముఖి ప్రోగ్రామ్‌ గ్రాండ్ సక్సెస్*

టీపీసీసీ చీఫ్ ఆదేశాల మేరకు ప్రజలకు ప్రభుత్వాన్ని దగ్గర చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన మంత్రులతో “ముఖాముఖి”.. ప్రతి రోజూ ఇద్దరూ ప్రజాప్రతినిధులు అందుబాటులో కార్యక్రమాలు విజయ వంతంగా కొనసాగుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ముఖ్య నేతలను ప్రజల్లో ఉండేలా చేసే ప్రయత్నం సాగుతోంది. గాంధీ భవన్ కేంద్రంగా, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ ముందుకు అడుగులు వేస్తోంది. నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధుల చైతన్యంతో గాంధీ భవన్ కళకళలతో నిండిపోతోంది.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సమన్వయంతో, ఒక వైపు అధికార పరంగా ప్రజలకు మేలు చేసే విధానాలను అమలు చేయడం.. మరోవైపు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం జరుగుతోంది.

*జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్*

రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్రంలో ‘జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్’ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు మహేశన్న సలహాలతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. సమానత్వం, హక్కుల పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించే విధంగా కార్యక్రమం కొనసాగుతోంది.

పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం టీపీసీసీ సరికొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. జిల్లాల ఇన్‌చార్జ్‌లు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పరిశీలకులను నియమిస్తూ పకడ్బందీగా వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి, నాయకులను ఎంపిక చేయడంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు.

ఇక పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పదవిలోకి వచ్చిన దాదాపు పది నెలల్లో పార్టీకి నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. ప్రజలతో, నేతలతో, కార్యకర్తలతో సమన్వయం కల్పిస్తూ – గాంధీ భవన్‌ను ప్రజాస్వామ్య చర్చల అడ్డాగా మారుస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. “మహేశన్న వ్యూహాలు ఫలిస్తున్న వేళ ఇది!” అని నాయకత్వ వర్గం గర్వంగా చెబుతోంది.

Exit mobile version