Newsminute24

తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు బీజేపీదే: బండి సంజయ్

BJPTelangana: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలపు తథ్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.  కేసీఆర్ పాలనపట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలే నిదర్శనమన్నారు. టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రజాస్వామ్యబద్దంగా నిరసన వ్యక్తం చేస్తున్న వేలాదిమంది నిరుద్యోగులు, ఏఎన్ఎంలపై కేసీఆర్ ప్రభుత్వం లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  డాక్టర్ చెన్నమనేని వికాస్, చెన్నమనేని దీప దంపతులు బీజేపీలో చేరారు.  కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ తోపాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అరవింద్, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, ఉమారాణి, అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ, సత్యనారాయణ పాల్గొన్నారు.  ఈ సందర్బంగా బండి  సంజయ్ మాట్లాడుతూ.. ప్రతిమ ఫౌండేషన్  ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ వికాస్, దీప దంపతులు బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. నమ్మిన సిద్దాంతం కోసం కష్ట పడి పనిచేసే కుటుంబం నుంచి వికాస్ వచ్చాడని అన్నారు.రాజన్న సిరిసిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు సంజయ్. కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో రామరాజ్యం రావడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు.

ఖమ్మంలో బీజేపీ ఎక్కడుందని అడిగిన వాళ్లకు రైతు గోస _ బిజేపి భరోసా సభ సక్సెస్ తో బీజేపీ సత్తా ఏందో నిరూపించాంమన్నారు సంజయ్. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ప్రజలను నమ్మించి రాజకీయ లబ్ది పొందాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని హెచ్చరించారు.కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించే పార్టీ బీజేపీ మాత్రమేనని.. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది కమలం పార్టీనేనని సంజయ్ తేల్చిచెప్పారు. 

రాఖీ పూర్ణిమ సందర్భంగా ప్రధాని మోదీ..గ్యాస్ ధర పెంపు భారాన్ని ఉజ్వల గ్యాస్ కనెక్షన్ దార్లకు రూ.400 తగ్గించడంతోపాటు అందరికీ 200 రూపాయలు తగ్గించడం హర్షణీయమన్నారు సంజయ్. గ్యాస్ పై వాగిన నోర్లు మూతపడేలా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.తెలిపారు సంజయ్. నీకు నేను రక్ష.. మనకు హిందూ ధర్మ రక్ష అంటూ జరుపుకునే పండుగని..  అందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని సంజయ్ ఆకాంక్షించారు.

 

Exit mobile version