Newsminute24

చంద్రబాబు దారే రాహులుకు రహదారి అవుతుందా?

Nancharaiah merugumala:

======================

ఎట్టకేలకు తెలుగుదేశం నేత నారా చంద్ర బాబు నాయుడు బాటలోకి వచ్చాడు కాంగ్రెస్ ఉగ్రనేత రాహుల్ గాంధీ. బాబులా తెల్ల గడ్డం పెంచాడు. నారావారిపల్లె నవ యువకుడి రీతిలో  ఇతర మేధావుల సలహాలు యువ ‘ప్రిన్స్’ వింటున్నాడు. చంద్రన్న 1990ల మధ్యలో అధికారంలోకి వచ్చాక ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్’ అనే బంగారు నినాదంతో దాదాపు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ‘జనరంజకంగా’ పరిపాలించారు. ఇప్పుడు అధికారం కోసం దక్షిణం నుంచి ఉత్తరాదికి నడిచిన రాహుల్ చంద్రబాబు తరహాలో కొత్త నినాదం జనం మీదికి వదిలాడు. బీజేపీ ‘అచ్చే దిన్’ నినాదం కాంగ్రెస్ పార్టీకి మాత్రం చెడ్డ రోజులు తెచ్చాయని ‘జాతీయ యువరాజు’ గుర్తించాడు. అందుకే తాను ప్రధాని అయితే దేశం ‘స్వర్ణిమ్ భారత్’ (బంగారు భారతం) అవుతుందని ఇండియా పౌరులకు రాసిన లేఖలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

కొన్ని దశాబ్దాల క్రితం రిలయన్స్ కమ్యూనికేషన్స్ మొబైల్ ఫోన్ యాడ్ కేంపెయిన్ లో అప్పటికి కన్నుమూసిన గ్రూప్ స్థాపకుడు ధీరూ భాయ్ అంబానీ ఫోటో కింద ‘మేరా సప్నా సబ్కా అప్నా’ (నా కల అందరిదీ) అనే మాటలు రాశారు. ఈ నినాదాన్ని అప్పట్లో ఎవరో ‘హిందూ’ పత్రికలో ఎగతాళిచేస్తూ, ‘ మేరా సప్నా-సబ్కా మాల్ అప్నా’ (అందరి సొమ్మూ నాది కావాలనేది నా కల) అని అన్నారు. అంబానీల శైలిలోనే రాహుల్ కూడా ‘ఆప్కా అప్నా రాహుల్’ (మీ సొంత) అని భారత పౌరులను ఉద్దేశించిన సందేశంలో  ప్రకటించుకున్నారు. ఏదేమైనా అంబానీలు, చంద్రబాబు నాయుడి గారి దారిలో నడిస్తేనే ఈ చిన్న గాంధీకి ముక్తి, మోక్షం.

Exit mobile version