పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ పై కాల్పులు..

Sambashiva Rao :

=============

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్ పై కాల్పులు క‌ల‌కలం సృష్టించింది. దేశంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్న డిమాండ్‌తో.. ఆక్టోబ‌ర్ 28 నుంచి ఇస్లామాబాద్‌ దిశగా లాంగ్‌మార్చ్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇమ్రాన్ ర్యాలీ అల్లాహో చౌక్‌కు చేరుకోగా.. ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు ఆయ‌న కంటైన‌ర్ పై ఎక్క‌గానే దుండ‌గులు ఒక్క‌సారిగా కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఆయన రెండు కాళ్ల‌కు గాయాలైయ్యాయి. స్థానికంగా ఉన్న ఆస్ప‌త్రిలో ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నారు.

ఇమ్రాన్ పై దాడిని పీటీఐ పార్టీ నేత‌లు తీవ్రంగా ఖండించారు. ఇమ్రాన్‌పై జరిగిన ఈ ఘటనను హత్యా ప్రయత్నంగా పేర్కొంది. షెహబాజ్‌ షరీఫ్ ప్ర‌భుత్వం తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ష‌రీఫ్ ప్ర‌భుత్వానికి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయని ఫవాద్‌ చౌధురి హెచ్చరించారు. ఇమ్రాన్‌ ఖాన్‌పై దాడి పాకిస్థాన్‌పై దాడిగా ఆయ‌న‌ అభివ‌ర్ణించారు. ఇక‌ దుండ‌గులు జ‌రిపిన కాల్పుల్లో ఆయ‌న‌తోపాటు మ‌రికొంద‌రు నేత‌లు గాయ‌ప‌డ్డారు.

 

పీటీఐ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్ పై కాల్పుల ఘ‌ట‌పై స్పందించారు ఆదేశ ప్ర‌ధాని షెవాబాజ్ ష‌రీఫ్. ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించారు. ఈ ఘ‌ట‌నపై విచార‌ణ‌కు ష‌రీఫ్ ఆదేశించారు. ఇమ్రాన్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు షెవాబాజ్ ట్వీట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.

Optimized by Optimole