మునుగోడు ఎగ్జిట్ పోల్ సర్వే.. గెలిచేది ఆపార్టీనే..

దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక లో గెలుపు ఎవరని వరిస్తుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న ఈ ఎన్నికలో గెలిచి మూడో సారి అధికారం చేజిక్కించుకోవాలని టిఆర్ఎస్ పట్టుదలతో ఉండగా.. మచ్చటగా మూడో ఉప ఎన్నికలో గెలిచి నల్గొండ తో పాటు తెలంగాణలో అధికారంలో కి రావాలని బీజేపీ భావిస్తోంది. అటు కాంగ్రెస్ సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు సత్తా చాటేందుకు ఎన్నికల బరిలో నిలిచింది.

కాగా రణరంగాన్ని తలపించిన ఈ మునుగోడు ఉప ఎన్నిక పోరు పోలింగ్ ముగియడంతో క్లైమాక్స్ చేరింది. మరో రెండు రోజుల్లో విజేత ఎవరన్నది తేలిపోనుంది. ఈ క్రమంలో పోలింగ్ సరళి ఆధారంగా newsminute24 ఎగ్జిట్ పోల్ సర్వే నివేదిక విడుదల చేసిందీ. హోరా హోరీగా జరిగిన ఈ ఉప ఎన్నిక ముక్కోణపు పోరులో ఫస్ట్ ప్లేస్ లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఉండగా.. రెండో స్థానంలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిలిచే అవకాశం ఉన్నట్లు నివేదిక చెబుతోంది.

మొత్తంగా పోలింగ్ సరళిని బట్టి చూస్తే మునుగొడులో .. దుబ్బాక ఫలితం రిపీట్ కాబోతుందన్నది ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్ . ఫలితాల సరళి సైతం నువ్వా నేనా అన్న తరహాలో వెలువడే అవకాశం ఉన్నట్లు నివేదిక చెబుతోంది.

Optimized by Optimole