Newsminute24

ప్రజా సమస్యల కోసం కృషి చేసే నాయకుడిని: కోటంరెడ్డి శ్రీధర్

NelloreRural: ఐదేళ్లకోసారి కనిపించే నాయకున్ని కాదని..నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలకై కృషి చేసే నాయకుడినని అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మంగళవారం ఎమ్మేల్యే క్యాంప్ కార్యాలయంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు.ఇక ఏ మాత్రం అధికార పార్టీలో ఉండడం శ్రేయస్కరం కాదని భావించి పార్టీ నుంచి బయటకోచ్చానని అన్నారు. నెల్లూరు ప్రజా ప్రతినిధులు అందరూ చొరవ తీసుకొని కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేలా చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. అధికారానికి దూరమైన ఆరోగ్యకరమైన రాజకీయం చేస్తున్నానని స్పష్టం చేశారు. అధికార పార్టీ నేతలు..  తన మాటలను విమర్శలుగా తీసుకోవద్దని..తాను ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్లు ఆయన తేల్చిచెప్పారు. నిధుల విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే ప్రజా పోరాటం చేస్తానని కోటంరెడ్డి హెచ్చరించారు.

Exit mobile version