మునుగోడుపై అమిత్ షా ఫోకస్.. ప్రచారాన్ని స్పీడప్ చేయాలని ఆదేశం..!!

మునుగోడు ఉప ఎన్నికపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోకస్ చేశారు. తెలంగాణ విమోచన అమృతోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సభ అనంతనం బీజీపీ రాష్ట్ర కోర్ కమిటితో సమావేశమయ్యారు. ఉప ఎన్నికపై అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్ధేశం చేశారు.తక్షణమే గ్రామలకు ఇంచార్జ్ లను నియమించాలని సూచించారు.ఉప ఎన్నికపై ఫోకస్ పెంచాలని..ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటానని స్పష్టంచేశారు. మునుగోడులో బీజేపీ మంచి వాతావరణం ఉందని.. గెలుపే లక్ష్యంగా నేతలంతా పనిచేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.

కాగా మునుగోడు ఉప ఎన్నికల ప్రచార శైలి పై అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో నేతలంతా పర్యటించేలా ప్రణాళిక రూపొందించి..పార్టీలో చేరికలపై ఫోకస్ పెంచాలని నేతలకు షా చురకలు అంటించారు.ప్రతి గ్రామానికి ఇన్ చార్జ్ నియమించాలని.. స్థానికంగా పట్టున్న నాయకుడికి కమిటీలో ప్రాధన్యం ఇవ్వాలని పేర్కొన్నాడు. ఉప ఎన్నికల ప్రచారాన్ని మరింత స్పీడప్ చేయాలని ఆధేశించారు.మునుగోడులో బిజెపి అభ్యర్థి గెలుపు ఖాయమనే సంకేతాలు ఇప్పటికే వెళ్లాయని..ప్రతి ఓటర్ ను కలిసి గెలుపు సంకేతాలను బలంగా తీసుకెళ్లాలని సూచించారు.

ఇక మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ గల్లంతు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా.కాంగ్రెస్, టిఆర్ఎస్ రెండు ఒక్కటేనన్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు.ప్రతి గ్రామంలో ముగ్గురు సభ్యులు గా కమిటీలు నియమించాలని, మండల, నియోజకవర్గాల వారిగా ప్రత్యేక కమిటీలు వేయాలని సూచించారు.రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయితో పాటు గ్రామానికి చెందిన నేత కమిటీలో ఉండేలా ప్లాన్ చేయాలని షా ఆదేశించారు.

మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికను అమిత్ షా టార్గెట్ చేశారు.ఉప ఎన్నిక ప్రచారం స్పీడప్ తో పాటు పార్టీలో చేరికలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అలసత్వం దరిచేరకుండా నేతలంతా కష్టపడి పనిచేయాలని.. భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని షా చెప్పకనే చెప్పారు.

Optimized by Optimole