Headlines

ప్రధాని మోదీ బాధనూ దగ్గరినుంచి చూశాను :అమిత్ షా

2002 గుజరాత్ అల్లర్లకి సంబంధించి కేంద్రహోమంత్రి అమిత్ షా ఓ వార్త సంస్థ ఇంటర్వ్యూలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు.శివుడు కంఠంలో విషాన్నిదాచుకున్నట్లుగా.. ప్రధాని నరేంద్రమోదీ 19ఏళ్లుగా అసత్య ఆరోపణల భారాన్ని మోస్తూన్నారని అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే దురుద్దేశంతో మోదీ ప్రతిష్టను మసక బార్చెందుకు విష ప్రచారం చేశారని ఆరోపించారు. అల్లర్ల విషయంపై..
19 ఏళ్లుగా మోదీ ఏ నాడూ పెదవి విప్పలేదని గుర్తుచేశారు. ప్రధాని బాధను చాలా ద‌గ్గ‌ర నుంచి చూశానన్నారు. కేసు విచారణకు హాజరయ్యే సమయంలో మోదీ ఎలాంటి అనైతిక చర్యలకు పాల్పడలేదని.. సిట్ విచారించాల‌ని భావిస్తే ఆయన దానికి స‌హ‌క‌రించిన‌ట్లు తెలిపారు.

ఇక గుజరాత్ అల్లర్ల విషయంలో మోదీకి క్లీన్ చిట్ రావడం ఆనందకరంగా ఉందన్నారు అమిత్ షా.కేసు విచారణ పూర్తి పారర్శకతతో సుప్రీం కోర్టు పర్యవేక్షణలో జరిగిందని అన్నారు. అటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు హాజరవుతుంటే.. ఆ పార్టీ నేత‌లు ధ‌ర్నాలు నిరసనలు తెలపడం విచారకరమన్నారు.

Optimized by Optimole