వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు చమత్కారమైన సమాధానాలు ఇస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఈనేపథ్యంలోనే ఓనెటిజన్.. ఆయనను మీరు ఎన్ఆర్ఐ అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తీరు నెటిజన్స్ హృదయాలను గెలుచుకుంది. దీంతో మహీంద్ర ఇచ్చిన సమాధానం ఎంటని.. వినియోగదారులు ఇంటర్ నెట్లో తెగ వెతుకుతున్నారు. ఇంతకు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే?
సాధారణంగా చమత్కారమైన ట్విట్లకు ప్రసిద్ధి ఆనంద్ మహీంద్రా. వైరల్ వీడియోలను పంచుకోవడమే కాక.. జీవితాన్ని మార్చే సలహాలు ఇస్తుంటాడు. అంతేకాక క్రమం తప్పకుండా ఫాలోవర్స్ తో డిస్కషన్స్ లో పాల్గొంటాడు. ప్రతిభావంతులైన వ్యక్తులకు తోచిన సాయం చేయడమే కాకుండా.. అవసరానుగుణంగా సహయపడతాడు. ఈనేపథ్యంలోనే అతను చేసిన ట్విట్ వైరల్ గా మారింది.
Just visiting family in New York. So am an HRI. Heart (always) resident in India….😊 https://t.co/ydzwTux9vr
— anand mahindra (@anandmahindra) July 5, 2022
జూలై 4న యునైటెడ్ స్టేట్స్ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకునే వేడుకల ఫోటోలకు క్యాప్షన్ జతచేస్తూ..కుటుంబ సమేతంగా వెళ్లానంటూ మహీంద్రా ట్విట్ చేశాడు. మాన్హాటన్ చుట్టూ వేడుకలను చూపించే ఒక థ్రెడ్‌ను సృష్టించి.. వీడియోను కూడా పోస్ట్ చేశాడు. దీంతో ఓ నెటిజన్ స్పందిస్తూ.. మీరు ఎన్ఆర్ఐ? అని అడిగారు. దానికి ప్రతిస్పందనగా ఆయన.. కుటుంబంతో న్యూయార్క్ సందర్శిస్తున్నాను. నేను హెచ్‌ఆర్‌ఐనిని.. మనసు మాత్రం భారతదేశంలోని పౌరుడిది అంటూ మహీంద్రా చెప్పిన సమాధానం నెటిజన్స్ హృదయాలను గెలుకుంది.