నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మరో వినూత్న కార్యక్రమం..

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుసుకునేందుకు ‘తటస్థుల దీవెన’ పేరుతో మరో యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు.ఇప్పటికే గడపగడకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రాష్ట్రంలోనే నాంది పలికిన శ్రీధర్ రెడ్డి.. ఈ యాత్రతో ప్రజలకు మరింత చేరువకానున్నారు.జనవరి మూడు నుంచి సుమారు 30 రోజులపాటు జరగనున్న పాదయాత్రకు రోట్ మ్యాప్ సైతం రెడీ అయ్యింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అర్బన్ ,గ్రామీణ ప్రాంతాల్లో యాత్ర సాగనుండగా..డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, విద్యావేత్తలు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, చిరు వ్యాపారులను నేరుగా కలిసి ప్రజాదీవెనలు అందుకోనున్నారు కోటంరెడ్డి. ఎమ్మెల్యేగా గత మూడున్నర ఏళ్లుగా తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు..ప్రజా సమస్యలను ఆయన పాదయాత్రలో స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.

ఇక నెల రోజుల పాటు సాగనున్న యాత్రలో..రాజకీయాలకతీతంగా తటస్థంగా ఉండే వారి మనసుల్లోకి చొచ్చుకు వెళ్లేలా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. దీంతో పాటు అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు నగరంలో గురువారం “పెద్దల ఆశీర్వాద సభ” పేరుతో భారీ కార్యక్రమానికి రూపకల్పన చేయడం రాజకీయంగా మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆరోగ్యం రీత్యా డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని పదేపదే చెబుతున్న శ్రీధర్ రెడ్డి మాత్రం ప్రజల్లోకి మరింత చొచ్చుకువెళ్లే లక్ష్యంతో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు.

మొత్తంగా నెల్లూరు రూరల్ లో మరింత బలపడాలన్న లక్ష్యంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడుగులు పడుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు.

You May Have Missed

Optimized by Optimole