ఏపీలో వైసీపీ ,జనసేన మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. జనసేన అధినేత పవణ్ కళ్యాణ్..కౌలు రైతు భరోసా యాత్ర బహిరంగ్న సభలో వైసీపీ గాడిదలు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. కౌంటర్ గా వైసీపీ ఎమ్యెల్యే అంబటి..తాము కాదు గాడిదలమని..బాబును మోసే నువ్వే పెద్ద అడ్డగాడిదవి అంటూ సెటైర్లు వేశారు.దీంతో ఇరుపార్టీల మధ్య సోషల్ వార్ మొదలైంది.ఇటు జనసేన నేతలు..అటు వైసీపీ నేతలు తగ్గేదెలే తరహాలో ట్విట్ల దండకంతో ట్విట్టర్ ను షేక్ చేస్తున్నారు.
ఇక జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ..వైసీపీ అంబటి ట్విట్ కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు.రేస్ లో ఈగాడిదని.. దాటగ్నలిగే గాడిద వైసీపీ లో లేదా.. ప్రతిసారి ఈగాడిదే ముందు వచ్చి ఒండ్రు పెడుతొంది అంటూ సెటైర్ పేల్చగా..నువ్వు గాడిదవి కాకుంటే..గాడిదలు అనగానే ఎగేసుకుంటూ ఎందుకు వచ్చావంటూ జనసేన నేత సందీప్ పంచకర్ల ఘాటూ విమర్శలు చేశారు.
ఇదిలా ఉంట..ే జనసేన ట్విట్టర్ వేదికగా వైసీపీ పై మరో కార్టూన్ బ్రహ్మస్త్రాన్ని సంధించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్..2024 నెట్ లోకి గోల్ చేసేందుకు బంతిని హిట్ చేయగా.. వైసీపీ అధినేత జగ్నన్ గోల్ అడ్డుకోలేక కిందపడుతున్నట్లు రూపొందించిన కార్టూన్ నెట్టింట్ట తెగ్న వైరల్ అవుతోంది.అటు జనసైనికులు ఈకార్టూన్ రీట్విట్ చేయండంతో పాటు ..2024లో ఇదే సీన్ రిపీట్ అవుతుందంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.