sambashiva Rao :
=========
Bigg Boss Season 6: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా తోమ్మిదోవారం ముగిసింది. ఈషో నుంచి ఇప్పటికే షాని, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్ , సూర్య ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తొమ్మిదో వారంలో బిగ్ బాస్ షో అత్యధిక TRP రేటింగ్‌ను పొందింది, లైటర్ కోసం గీతూ, బాలాఆదిత్య మధ్య జరిగి ఫైట్ ఒక్కసారిగా షో రేటింగ్ పెరగటానికి కారణమైంది. వారం గీతూ ప్రవర్తన వీక్షకులకి విరక్తి కలిగించింది. నాగార్జున మరోసారి క్లాస్ తీసుకుంటారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ వారం ప్రోమో కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇంటి సభ్యులు తొమ్మిదో వారం ఎలిమినేషన్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. గత వారంలో ఎలిమినేషన్‌కు నామినేట్ వారిలో ఆది రెడ్డి, బాల ఆదిత్య, ఫైమా, గీతూ రాయల్, ఇనాయ, కీర్తి, మెరీనా, రేవంత్, రోహిత్ , శ్రీ సత్య ఉన్నారు. సోషల్ మీడియాలో ఈవారం శ్రీ సత్య, ఫైమా మరియు మెరీనా డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే మేకర్స్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అంతే కాదు ఒక కంటెస్టెంట్‌ని సీక్రెట్ రూమ్‌కి పంపుతారని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లే వాళ్ళ లిస్టులో శ్రీ సత్య లేదా మెరీనా పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరు ఇంటి నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. శ్రీ సత్య కెప్టెన్ అయిన కారణంగా ఆమె సేఫ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆమెను సీక్రెట్ రూంకి పంపినట్లు తెలుస్తుంది.
మెరీనా కంటే ఈ వారం శ్రీ సత్య కంటెంట్ పరంగా రాణించింది. శ్రీ హన్ తో కలిసి ఇనయను టార్గెట్ చేసింది.
ఇక మెరీనా ఈ వారం ఎలిమినేట్ అయిందని సమాచారం. గత రెండు వారాలుగా మెరీనా తన ఆటను మెరుగుపరుచుకోవడానికి ఆమెకు రెండుసార్లు అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ ఈసారి మాత్రం ఓట్లు తక్కువగా రావడం, మిషన్ ఇంపాజిబుల్ టాస్క్ లో సరెనా ఆటతీరు కనబరచకపోవడం తో మెరీనా షో నుంచి ఎగ్జిట్ అయింది.