Site icon Newsminute24

Telangana: కులం చిదిమేసింది..!!

రాహుల్ కశ్యప్:

నవమాసాలు మోసి
ఎన్నో ఆశలతో
బిడ్డ కోసం
ప్రసవ వేదనను
పంటికింద నొక్కిపట్టి
భరించిన కష్టం విలువ తెలియని
నీచ రాజకీయుల
కులగజ్జికి స్వస్థి పలకాల్సిందే..!

ఓట్లడిగే రోజు లేని కులం..
దేవుడి రూపంలో ఎందుకొచ్చింది..?

నాలుక మడిచిన నాయకులకు
కన్నతల్లి గోష కనిపిస్తలేదా..?
మా బీసీలు.. మా ఓట్లు..
రాజ్యాధికారం కోసమేనా..?

రాడేం ఎవ్వడు..కులం కోసం..!
నిలబడిన బడుగులకు నీరాజనం..

తక్కువ కులమన్నోన్నీ
తూర్పాల పట్టాలి..
అహంకారాన్ని అంధకారం చేయాలి..
ఒక్కటవ్వాలి నువ్వు నేను..
లేదింకా ఏ కులానికి అడ్డుకట్ట..

గొంతుమీద కాలు పెట్టిన..
కసాయికి కావరమరగాలి..!
పసిగుడ్డుపై పైశాశికత్వానికి
ఫలితమివ్వాలి..

కులదూషణకు నీ తెగింపే సమాధానమవ్వాలి.

మూగబోయిన అమ్మకు..
ఇదే నా నివాళు💐

Exit mobile version