మేఘానికి చిల్లుపడిన మాదిరి వర్షం.. వీడియో వైరల్!

ఓవీడియో ఇంటర్ నెట్లో తెగ హాల్ చల్ చేస్తోంది. ఓప్రాంతంలో ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.ఆతర్వాత ఏముంది సర్వసాధారణంగా .. అందరూ వర్షం పడుతుందని అనుకుంటారు. అది నిజమే కానీ అది మాముల వర్షం కాదు.. ఒక్కసారి ఆకాశానికి చిల్లుపడి నీరంతా నేలపై కుమ్మరించిన మాదిరి వర్షం కురిసింది. ఈఘటన ఆస్ట్రీలియాలోని మిల్ల్ స్టట్ వద్ద గల రెండు పర్వతాల మధ్య జరిగింది.

 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి వాటిని క్లౌడ్ బర్డ్స్ అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈతరహా ఘటనల వలన భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశముందన్నారు. అన్నట్లు ఈవీడియోని చిత్రీకరించిన వ్యక్తి పేరు పీటర్ మేర్. మన దేశంలో పర్వత ప్రాంతాలైన ఉత్తర్ ఖాండ్ , హిమాచల్, లడఖ్ లో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం కూడా ఉందండోయ్.

Optimized by Optimole