శివలీలలు.. బ్రిటిష్ వారు కట్టించిన ఏకైక గుడి ఎక్కడ ఉందో తెలుసా…..

పరమశివుడి మహిమానిత్వం గురించి తెలిపే కథలు అనేకం వినడం ,చదవడం పరిపాటి. కానీ ఇప్పుడు చదివే  ఈకథ  మాత్రం చరిత్రలో నిలిచిపోయిన కథ అని చెప్పవచ్చు . భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో  సాక్ష్యాత్తు పరమశివుడు ..ఓ  బ్రిటిషర్ కి కనిపించాడని చెబుతున్న వాస్తవిక సంఘటన. అంతేకాక మనదేశంలో బ్రిటిష్ వారు కట్టించిన ఏకైక గుడి ఇదే కావడం గమన్హారం.  ఇంతకు ఆగుడి కథ ఏంటో తెలుసుకుందా..?

అది 1879 లో బ్రిటిష్ వాళ్ళు భారత్ ని పరిపాలిస్తున్నప్పుడు, “ఆఫ్ఘానిస్తాన్ లో జరుగుతున్న యుద్దంలో కల్నల్ మార్టిన్ అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. ఆ యుద్దం ఒక రోజు, రెండు రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది. .కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు. ఆమె పేరు మేరీ. ఇలా కొన్ని రోజుల గడువగా ఆమె కి కొన్నాళ్ళకి కల్నల్ నుండి క్షేమ సమాచారాలు అందడం ఆగిపోయింది. దీంతో ఆమె తీవ్రమైన మనోవేదానికి గురి అయింది. ఎప్పుడు భయంతో, బాధతో తనలో తాను కుమిలి పోతూ ఉండేది.

 రాత్రి పగలు తేడా లేకుండా  భర్త కోసం పరితపిస్తూ  ఎదురు చూడసాగింది. అయితే ఓ రోజు గుర్రం మీద వెళుతున్నప్పుడు  బైధ్యానాథ్ గుడి పక్కన నుండి వెళ్తుండగా.. వేద మంత్రాలు వినపడటంతో వెంటనే గుర్రం ఆపి గుడి లోపలికి వెళ్లింది. అక్కడ పూజారులు మహా శివుణ్ణి పూజించడాన్ని ఆమె గమనించింది.  పూజారులు “ఆమె మనసులోని  బాధను ” గ్రహించి పలకరించారు. “ఏమైంది తల్లి అని అడగగనే.. వెంటనే ఆమె భర్త ‘కల్నల్ గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో పూజారులు ఆమెను ఓదారుస్తూ ..“మహా శివునికి తన బాధని చెప్పుకోమని అన్నారు. ఆమె గుడిలోకి వెళ్లి మహా శివునికి తనగోడును వెళ్లబోసుకుని ఇంటికి వెళ్లింది . ఆతర్వాత ప్రతిరోజూ  శివున్ని భక్తితో కొలుస్తూ “లఘు రుద్ర మంత్ర జపం 11 రోజులు చేసింది. భక్తితో ఆరాధిస్తూ.. భర్తని క్షేమంగా ఇంటికి వస్తే  బైధ్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని మనసులో కోరుకుంది.

అలా 11 రోజులు శివున్ని ఆరాధిస్తూ  జపం చేసింది. ఈక్రమంలో ఆమెకు  కల్నల్ నుండి ఉత్తరం వచ్చింది.  ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. తాను ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడినట్లు కల్నల్ ఉత్తరంలో తెలిపాడు. శత్రువులు  చుట్టూ ముట్టి చంపేందుకు రెడీ అయిన తరుణంలో..తనకు  బ్రతుకు మీద  ఆశ  పోయిందని.. ఆ సమయంలో తాము తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని కల్నల్ ఆవేదనను వెలిబుచ్చాడు. అలాంటి సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా.. అక్కడ ఒక భారతదేశపు మహా యోగి వెలుగుతూ కనిపించాడని.. ఆయన పులి చర్మం ధరించి.. మూడు సూది మొనలతో ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నాడని.. ఆసాధువు విభూతి కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాసుకొచ్చాడు.

సాధువు  మేధస్సుకు, తేజస్సుకి శత్రుసైనికులు  వెనుతిరిగి పారిపోయారని  కల్నల్ ఉత్తరంలో పేర్కోన్నాడు.  యోగి వల్లే తాము విజయం సాధించమన్నాడు. మహసాధువు కంఠం 1000 ఏనుగుల గంభీరం, పొడవైన ఉంగరాల జుట్టు ఉన్నాయన్నాడు. అంతేకాక నీవు భక్తితో తనని పూజిస్తున్నావని.. అందుకే రక్షించడానికి వచ్చాడని యోగి తనతో చెప్పినట్లు  కల్నల్ ఉత్తరంలో తెలిపాడు. దీంతో ఉత్తరం చదివిన భక్తురాలు..శివున్ని మనసులో తలచుకుని ప్రార్థించసాగింది. 

అలా కొన్ని రోజులు గడిచాక కల్నల్ ఇంటికి చేరుకున్నారు. తర్వాత కల్నల్, మేరీ భైద్యనాథ్  గుడిని దర్శించుకున్నారు. కల్నల్ గుడిలో ఉన్న మహా శివుని రూపం చూసి యుద్ద భూమిలో చూసిన మహా యోగి ఇతనే అంటూ ఆశ్చర్యపోయాడు.  అప్పటి నుండి కల్నల్, మేరీ దంపతులు “మహా శివునికి” అపార భక్తులుగా మారిపోయారు. అనంతరం బైధ్యనాథ్ గుడిని పునర్నిర్మించారు. అంతేకాక వాళ్ల దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుడికి ఇచ్చేశారు. జన్మ ధన్యం చేసుకున్నారు.

ఇప్పటికీ బైధ్యానాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ళ ఇద్దరి పేర్లు ఉన్నట్లు అక్కడి వారు చెబుతారు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఏకైక గుడి ఇదే కావడం విశేషం.  

Optimized by Optimole