నిరుపేద విద్యార్థుల కోసం గురుకులాలను ప్రారంభించారు: డీఎస్పీ నాగభూషణం

సూర్యాపేట జిల్లా బాలెంల గురుకుల పాఠశాలలో స్వచ్ఛ గురుకుల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిఎస్పి నాగభూషణం  హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థినులు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేద విద్యార్థుల కోసం గురుకులాలను  ప్రారంభించిందని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ శైలజ మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులకు గురుకులాలు చక్కటి అవకాశమని అన్నారు.  విద్యార్థినులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించడం జరుగుతుందన్నారు. మానసిక ఉల్లాసం కోసం ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

 

 

 

Optimized by Optimole