మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల టంగ్ స్లిప్… పెకాషం పంతులు అంటూ వీడియో వైరల్..!!

మునుగోడులో ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నేతలు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నామినేషన్ గడువు నేటితో ముగియనున్న  నేపథ్యంలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , పార్టీ నేతలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ఈ వీడియో పట్ల నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. మునుగోడు మరో పెకాశం పంతులు దొరికాడంటూ చలోక్తులు విసురుతున్నారు.

ఇక వీడియో గమనించినట్లయితే.. నామినేషన్ కార్యక్రమం సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పేరుకు బదులు.. నందమూరి తారక రామారావు అని.. తమ్మినేని వీరభద్రంకి బదులు.. తమ్మినేని సీతారాం అంటూ టంగ్ స్లీప్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను  ప్రముఖ మీడియా సంస్థ ఛానల్ వీడియో సోషల్ సైట్స్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

 

ఇక వీడియో పట్ల నెటిజన్స్ కామెంట్స్ తో నవ్వులు పూయిస్తున్నారు. కొందరు పొద్దున్న గూకలే ఆగమైండా ఎంటి అంటూ కామెంట్ చేయగా.. మరి కొందరు మునుగోడుకు మరో పెకాశం పంతులు దొరికాడు అంటూ కామెంట్స్ బాక్స్ నింపేస్తున్నారు.

 

Optimized by Optimole