మూడో టీ20 లో టీంఇండియా ఓటమి.. సిరీస్ కైవసం!

ఇంగ్లాడ్ తో జరిగిన మూడో టీ20 లో భారత్ ఓటమిపాలైంది. ఇప్పటికే టీ20 సిరీస్ నూ గెలుచుకున్న టీంఇండింయా.. నామామాత్రంగా జరిగిన మ్యాచ్ లో 17 పరుగులతో పరాజయం పాలైంది. జట్టులో సూర్యకుమార్ యాదవ్  టీ20లో తొలి సెంచరీ నమోదు చేశాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆజట్టులో మలన్‌, లివింగ్‌స్టోన్‌ తమదైన ఆటతీరుతో చెలరేగారు. భారత బౌలర్లలో హర్షల్‌ పటేల్‌, బిష్ణోయ్‌ చెరో రెండు వికెట్లు.. ఆవేశ్‌ ఖాన్ ‌, ఉమ్రాన్‌ మాలిక్ తలా ఓ వికెట్ పడగొట్టారు.

అనంతరం 216 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన టీంఇండియా 198 పరుగులు మాత్రమే చేసి 17 పరుగులతో పరాజయం పాలైంది. జట్టులో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. ఇంగ్లాడ్ బౌలర్లో టోప్లే మూడు..విల్లే, జోర్డాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Optimized by Optimole