ఆస్కార్ బరిలో RRR సాంగ్..

ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ బరిలో సత్తా చాటేందుకు నాలుగు భారతీయ చిత్రాలు పోటీపడుతున్నాయి. ఆస్కార్  అవార్డుల నామినేషన్స్ లో పోటీ పడే చిత్రాల షార్ట్ లిస్ట్ ను అకాడమీ ప్రకటించగా…అందులో RRR చిత్రం నుంచి నాటునాటు గీతం చోటుదక్కించుకుంది. ఉత్తమ ఒరిజినల్  సాంగ్  కేటగిరీలో ఈ పాటను ఎంపిక చేశారు. సుమారు 10 విభాగాలకు సంబంధించి నాలుగు విభాగాల్లో భారతీయ చిత్రాలు స్థానాలను దక్కించుకున్నాయి. నాటు నాటు గీతంతో పాటు ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో..‘లాస్ట్  ఫిల్మ్  షో, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్  విభాగంలో ‘ఆల్  దట్  బ్రీత్స్ ’, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్  ఫిల్మ్  కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్  జాబితాలో చోటు సొంతం చేసుకున్నాయి. షార్ట్ లిస్ట్ లోఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకూ ఓటింగ్  నిర్వహించనున్నారు. ఆ ఓటింగ్ ఆధారంగా  జనవరి 24న ఆస్కార్ నామినేషన్ లో నిలిచిన చిత్రాలను ప్రకటిస్తారు. అనంతరం మార్చి 12న విజేతలకు  అవార్డులు అందించనున్నారు.

 

Related Articles

Latest Articles

Optimized by Optimole