యువరాజ్ తరహాలో బుమ్రా.. వరల్డ్ రికార్డు!

టెస్ట్ క్రికెట్లో భారత తాత్కలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్ సాధించాడు. ఒకే ఓవర్లో అత్యధకంగా.. 35 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాడ్ తో జరుగుతున్నఐదో టెస్టులో బుమ్రా ఈఫీట్ సాధించాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో 35 పరుగులు రాగా.. అందులో అతను 28 పరుగులు చేశాడు. దీంతో గతంలో వెస్టిండీస్ క్రికెటర్ బ్రియన్ లారా పేరిట ఉన్న 28 పరుగులను రికార్డును.. బుమ్రా అధిగమించాడు.

ఇక విండీస్ దిగ్గజం లారా సైతం ఇంగ్లాడ్ బౌలర్ పీటర్సన్ బౌలింగ్లో 28 పరుగులు రాబట్టడం విశేషం. ఆతర్వాత 2013 లో ఆస్ట్రేలియా క్రికెటర్ జార్జీ బెయిలీ అండర్సన్ బౌలింగ్లో 28 పరుగులు రాబట్టాడు. 2022లో మహారాజ్.. రూట్ పోర్ట్ బౌలింగ్ లో 28 పరుగులు చేసి.. ఒకే ఓవర్లో అత్యథిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాందించారు.

యువరాజ్ ను గుర్తు చేసిన బుమ్రా…
ఇంగ్లాడ్ బౌలర్ బ్రాడ్ బౌలింగ్ లో బుమ్రా చెలరేగి ఆడిన తీరు.. 2007 టీ20 వరల్డ్ కప్ యువరాజ్ సింగ్ ఆటను గుర్తుకు తెచ్చింది. ఆమ్యాచ్ లో యువరాజ్ చేలరేగి ఆడి.. అతని బౌలింగ్ లో ఆరు బంతులను సిక్సర్లుగా మలిచి 36 పరుగులు రాబట్టాడు. బుమ్రా సైతం బ్రాడ్ బౌలింగ్ లో 35 పరుగులు రాబట్టి..యువరాజ్ ను గుర్తుకుతెచ్చాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Optimized by Optimole