Site icon Newsminute24

లోకేష్ ను కలిసిన జనసేన నేతలు..చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు….

APpolitics:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను జనసేన నేతలు  మంగళవారం రాజమహేంద్రవరంలో  పరామర్శించారు. మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని, దుర్మార్గపాలనపై కలసి పోరాడుదామని జనసేన నేతలన్నారు. చంద్రబాబు అరెస్టును జనసేన తీవ్రంగా ఖండిస్తోందని .. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో ఆధారాలు లేకుండా చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిందని..రాష్ట్రంలో జగన్ అరాచకపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అరెస్టును ఖండించిన వారిపైనా వైసీపీ నేతలు  విమర్శలు చేస్తున్నారని, ఎన్నికల తర్వాత వైసీపీ భూస్థాపితం అవుతుందన్నారు. టీడీపీ పిలుపునిచ్చిన బంద్ కు మద్ధతు తెలిపి, బంద్ లో పాల్గొన్నందుకు జనసేన నేతలు, కార్యకర్తలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ ను కలిసిన వారిలో జనసేన నేతలు పితాని బాలకృష్ణ,  అత్తి సత్యనారాయణ, బత్తలు బలరామకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు, చెరుకూరి రామారావు, తదితరులున్నారు.

 

Exit mobile version